Teenmar Mallanna : తీన్మారే!
మల్లన్న.. ఆడు మొగాడ్రా బుజ్జి.. ‘ఆడు మొగాడైతే మిగతా వాళ్లు మాడాగాళ్లా..’ అని కొందరు అనుకోవచ్చు.. కానీ నిజంగా ఆడు మగాడే..
తీన్మార్ మల్లన్న.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరే హాట్ టాపిక్. మల్లన్న ఓ సామాన్య జర్నలిస్టు.. ప్రశ్నించే గొంతు.. ఆయన ఏ పార్టీ లీడర్ కాదు.. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రాండ్ లేదు.. కానీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో లక్ష ఓట్లకుపైగా సాధించి ఓ ప్రభంజనంలా దూకుకెళ్తున్నాడు. ఎంతో చరిత్ర కలిగిన పార్టీలు, పెద్దపెద్ద లీడర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంతలా ప్రభావితం చేయడం అంతా ఆషామాషీ కాదు. ఇది మల్లన్నకు సోషల్ మీడియాతో ఒక్కరోజు వచ్చిన స్టార్డమ్ ఏమీ కాదు.. దాదాపు ఏడేళ్లపైగా ఆయన శ్రమించిన ఫలితం ఈ ఓట్లు..
మల్లన్న బయోడేటా…
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్.. 1982 జనవరి 17న చింత బాగయ్య, జానమ్మ దంపతులకు పాత నల్గొండ జిల్లా (ప్రస్తుతం యాదాద్రి జిల్లా) తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జన్మించాడు. నవీన్ 1 నుంచి టెన్త్ వరకు మాదాపూర్ జడ్పీ స్కూల్ ల్లో చదివారు. ఇంటర్ విద్యానగర్‌లో ఎస్వీఎస్, డిగ్రీ భువనగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో పూర్తి చేశారు. ఓయూలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం పూర్తి చేసి.. 2008లో మొదటి సారిగా ఐ న్యూస్‌లో చేరారు. తర్వాత ఎన్టీవీ, జెమినిలో పని చేశారు. 2011 అక్టోబర్‌లో వీ6 న్యూస్‌లో చేరి తీన్మార్ న్యూస్‌లో తీన్మార్ మల్లన్నగా తెలంగాణ మాండలికాల్లో వార్తలు చదువుతూ ఆయన జనాన్ని ఆకట్టుకున్నారు. అలా నవీన్‌కుమార్ తీన్మార్ మల్లన్నగా మారిపోయాడు. అది ఎంతలా అంటే గెజిట్ ద్వారా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైన్స్‌లో కూడా పేరు మార్చుకునేలా..!
2014లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి…
ఇక 2014 హుజూర్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనే మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో పోటీలోకి దిగినా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచే బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నాడు. మల్లన్న స్వతహాగా జర్నలిస్టు కావడంతో తన పోరాటానికి అదే పంథాను ఎంచుకుని 2018లో క్యూటీవీ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టారు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను సెటేరిక్గా చదువుతూ.. తనదైన రీతిలో పాలకుల అవీనితి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆది నుంచి ముందంజలోనే..
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న ఆది నుంచి ముందజలోనే ఉన్నారు. నిత్యం ఏదో ఊరికి వెళ్తూ అక్కడే మార్నింగ్ న్యూస్ చదువుతూ అక్కడి వారిని చైతన్యం చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు. అయితే పోలింగ్ ముందు వరకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మల్లన్నను కనీసం ఒక అభ్యర్థిగా కూడా గుర్తించలేదు. తోటి జర్నలిస్టులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. కానీ కౌంటింగ్ మొదలైన తర్వాత అంతా ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి గట్టి పోటినిస్తూ ముచ్చెమటలు పుట్టిస్తున్న మల్లన్న.. నైతికంగా ఎప్పుడో గెలిచాడు..
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..