జనగామ, మన చౌరాస్తా :
జనగామ జిల్లా నుంచి ఆనాటి తొలి దశ, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఆదివారం హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు జనగామ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు వెళుతున్న ప్రత్యేక బస్సులను కలెక్టరేట్ ఏవో రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు.
హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగిన సంస్కృతిక ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ
నాటి ఉద్యమ జేఏసీ కార్యాచరణలో పాల్గొన్న స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ దశాబ్ది ఉత్సవాలలో ఉద్యమకారులను భాగస్వామ్యం చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులతో పాటు ప్రభుత్వం నుండి పింఛన్ లాంటి సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రత్యేక కేటగిరీలో అర్హులుగా చేసి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన
ఉద్యమకారులు కాసాని ఉపేందర్, మోర్తాల ప్రభాకర్, ఎండబట్ల భాస్కర్, మహేష్, రమేష్, రాజేందర్, పరుశురాములు, మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.