
- ఆడిషనల్ కలెక్టర్ కు మార్కెట్ పాలకవర్గం వినతి
చేర్యాల, మన చౌరాస్తా : కంది రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న కోరారు. కంది పంట పండించిన రైతులకు మార్కెట్లో కందుల అమ్మకానికి ఆన్ లైన్ లో పంట నమోదు చేయని, రైతులకు ఆన్ లైన్ చేయడానికి అవకాశం కల్పించాలని, మార్కెట్ యార్డు అభివృద్ధితో పాటు పలు అంశాలపై చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకవర్గం సభ్యులు బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడీ జీవన్ రెడ్డి, డైరెక్టర్లు బైరగోని భాను ప్రకాష్ గౌడ్, ఇర్రి రాంరెడ్డి, పాల లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.




