
- ప్రమాద బీమాతో జర్నలిస్టులకు ధీమా
- జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
- జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాలు అందజేత
మన చౌరాస్తా, జనగామ ప్రతినిధి : నిరంతరం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా ఎంతో ముఖ్యమని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. టీఎస్జేయూ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ రావుల నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు ఆధ్వర్యంలో జనగామ జిల్లా టీఎస్జేయూ యూనియన్ సభ్యులందరికీ ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమాను అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబంధించిన బీమా పత్రాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారని, ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించడం పట్ల తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నాయకులను కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల పలు సమస్యలను జర్నలిస్టు నాయకులు కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్జేయూ టీఎస్జేయూ జనగామ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్, ప్రధాన కార్యదర్శి బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్, కోశాధికారి కొన్నే ఉపేందర్, గౌరవ సలహాదారు చిల కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు ఎం.శివ కుమార్, యూనియన్ ప్రతినిధులు పి.రాజు, చెల్లోజు నవీన్చారి, ఓంకార్, ఆఫ్రోజ్, గన్ను కార్తీక్, వినోద్, లక్ష్మయ్య, పాండు, దేశాయ్ రెడ్డి, చిటుకుల అంజయ్య, గండి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.