variant effect : వేరియంట్‌తో వణికిపోతున్న అగ్రరాజ్యం..
కంటికి కనిపించని కరోనా ఇప్పుడు అగ్రరాజ్యన్ని వణికిస్తోంది. రెండు వేవ్ లలో కంటే ఈ సారి ఇంకా విజృంభిస్తోంది అని అమెరికన్ సైంటిస్టులు అంటున్నారు . వేరియంట్ ల రూపంలో విజృభిస్తుండడంతో వ్యాక్సిన్ ప్రభావం కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఒకపక్క చైనా ఇప్పటికే వంద కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి రికార్డు సృష్టిస్తుంటే.. ఇంకో పక్క అమెరికాలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయి. వేరియంట్ దాటికి అమెరికా చిగురుటాకులా వానికి పోతోంది. (variant effect )
మరో వేవ్ రాబోతోంది సిద్ధంగా ఉండాలని అంతర్జాతీయంగా నిపుణులు హెచ్చిస్తునే ఉన్నా చాలా మంది నిబంధనలు పాటించకుండా మహమ్మారి పెరిగేలా చేస్తున్నారు. అమెరికాలో అయితే అప్పట్లో అధ్యక్షుడే మాస్క్ అవసరం లేదు అనేలా తెగ స్పీచ్ లు ఇచ్చాడు. దాని ఫలితమే ఇప్పుడు అమెరికాకి శాపంగా మారిందని పలువురు నిపుణులు అంటున్నారు.
రోజుకు వేళల్లో కొత్త కేసులు వస్తున్నా, రికవరీల సంఖ్యను చూసుకుని అమెరికా ఇన్నాళ్లు ఆనంద పడింది. అయితే తాజాగా ఇప్పుడు మరణాల సంఖ్యను చూసి బెంబేలెత్తి పోతోంది. మహమ్మారి (variant effect) దాటికి అమెరికన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌తో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతి చెందినట్లు అమెరికన్ పత్రికలు కోడై కూస్తున్నాయి.
కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో సెప్టెంబర్ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. ఈ శుక్రవారం ఏకంగా 1.65 లక్షల మంది వైరస్ బారిన పదడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. కేసుల సంఖ్య మాట అటు ఉంచితే మరణాలు మాత్రం రెండువేలకు పైగానే ఉండటంతో ఏమి చేయాలో అని ప్రభుత్వం తలలు పట్టుకుంతోంది. డెల్టా వేరియంట్ కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC) వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు. Vaccine తో పాటు బూస్టర్ డోస్‌లు ఇవ్వడానికి అమెరికన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కరోనా మహమ్మారి ((variant effect) )ఇప్పుడే ఇంతలా భయపెడుతు ఉంటే ముందు ముందు ఎలాంటి మారణ హోమాన్ని చూడాలి వస్తుందో అని అంతర్జాతీయ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితే ఇలా ఉంటే ఆఫ్రికా ఖండం లాంటి దేశాలు పరిస్థితి ఏంటని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. కలియుగం అంతం అయిపోతుంది అని అంతా అంటుంటే ఎంటో అనుకున్నా ఇదే కాబోలు. కంటికి కనిపించని జీవితో ప్రపంచమే యుద్ధం చేస్తోంది.