vedam nagaiah : నాగయ్య ఇక లేరు
ఓ వైపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే వేడుకల్లో మునిగి తేలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఒక్క సారిగా విషాదం అలుముకుంది. వేదం సినిమాలో.. ‘పటేలా… పటేలా..’ అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, అందరినీ ఆకర్షించిన క్యారెక్టర్ ఆర్టిస్టు నాగయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఏపీలోని గుంటూరు జిల్లా దేసవరంపేటకు చెందిన ఆయన తెలుగు చిత్రపరిశ్రమలో తక్కువ టైంలోనే మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు, నటీనటులు సంతాపం ప్రకటించారు.
రోడ్డుపై వెళ్తుంటే చూసి..
గుంటూరు జిల్లాకు చెందిన నాగయ్యా చాలా కాలంగా తెలంగాణలోనే ఉంటున్నారు. ఓసారి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే డైరెక్టర్ క్రిష్ కంట పడ్డాడు. వెంటనే ఆయన కారు దిగి వచ్చి నాగయ్యతో మాట్లాడి సినిమాకు ఒప్పించి.. వేదం సినిమాలో నటుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత నాగయ్య.. నాగవల్లి, స్పైడర్, రామయ్య వస్తావయ్యా వంటి 20 చిత్రాల్లో నటించారు. ఇటీవల ‘రైతు రుణ మాఫీ’పై తీసిన ఓ షార్ట్ ఫిలింలో మెరుపు మెరిశారు నాగయ్య..
ఆదుకున్న కేసీఆర్..
ఎంతో మంది స్టార్ట్స్ ఉన్న వేదం చిత్రంలో నాగయ్య తనదైన స్టైయిల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు 20 సినిమాల్లో నటించారు. కానీ ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. కనీసం టిఫిన్ చేసేందుకు కూడా డబ్బులు లేక పస్తున్నాడు. లాక్ డౌన్ టైంలో ఆయన పరిస్థితి మీడియాలో రావడంతో సీఎం కేసీఆర్ స్పందించి అప్పట్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు.
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్