
బచ్చనపేట, మన చౌరాస్తా : బచ్చన్నపేటలోని ప్రభుత్వ పశువుల దవాఖాన ప్రధాన ద్వారం ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ అడ్డాగా మారుతోంది. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారి తన వాణిజ్య వాహనాలు అధిక మొత్తంలో కార్టన్ బాక్సులు లోడ్ చేసి దవాఖాన ప్రధాన ప్రవేశ ద్వారం నిలుపడంతో రైతులు, పశువుల యజమానులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.