జనగామ, (చౌరాస్తా న్యూస్) : హైదరాబాద్లో విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో జనగామకు చెందిన విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు పథకాలు కైవసం చేసుకున్నారని కరాటే మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ తెలిపారు. పథకాలు గెలుపొందిన విద్యార్థులలో 18 సంవత్సరాల కటాస్ విభాగంలో రాజు బంగారు పథకం, అండర్ 14 లో స్పారింగ్ విభాగంలో అక్షిత్ మణివర్ధన్ బంగారు పథకం, కటాస్లో కాంస్య పథకం సాధించగా, 12 సంవత్సరాల కటాస్ విభాగంలో ఓ.స్వప్నిల్ రజత పథకం, అండర్ 14 లో బాలికల విభాగంలో సింగరి మణ్విత, బండారి స్రవంతి రజత పథకాలు గెలుపొందగా, 10 సంవత్సరాల కటాస్ విభాగంలో ఓ.సాకేత్, వై.విరాట్ రజత పథకాలు, 12 సంవత్సరాల బాలుర కటాస్ విభాగంలో ఓ.నిక్షిత్ మణివర్ధన్, బి.మణిరణధీర్, ఎస్.మణిరుధ్విక్, కాంస్య పథకాలు సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను సినీ హీరో, కరాటే మాస్టర్ ఇంద్రసేన, టోర్నమెంట్ ఆర్గనైజర్ బాబురావు, విక్టరీ షోటోకాన్ కరాటే ఇండియా చీఫ్ రంగు మల్లికార్జున్ గౌడ్, సీనియర్ కరాటే మాస్టర్స్ సదాశివుడు, వడ్డెపల్లి సురేష్, వెంకటేష్, గోపన్న, నందప్రసాద్, కన్నన్ గౌడ్ తదితరులు అభినందించారు.