మన చౌరాస్తా, బచన్నపేట : బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామం మాజీ సర్పంచ్ బాపు రెడ్డి తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు పిన్నింటి మాధవరెడ్డి ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బచన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి , ముఖ్య నాయకులు ఆయన భౌతికాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
కుటుంబసభ్యులను పరామర్శించారు. అదేవిధంగా గోపాల్ నగర్ గ్రామంలో నసిరుద్దీన్ కుమారుడు షాకీర్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం నూకల బాల్రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండనాగారం గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇజ్జగిరి రాములు తండ్రి ఇజ్జగిరి బాలయ్య నిన్న రాత్రి అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాల్రెడ్డి వెంట జంగిటి విద్యనాథ్, మాజీ మార్కెట్ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, అల్వాలఎల్లయ్య, జిల్లా సందీప్, మహమ్మద్ మసూద్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, కొప్పుల శ్రీధర్, దాచేపల్లి నర్సింగరావు, దిడిగా రమేష్, మాజీ సర్పంచ్ ఆముదాల మల్లారెడ్డి, గుర్రపు బాలరాజు, జ్యోతి భాస్కర్, ఎద్దు హరీష్, ఇజ్జగిరి పరుశురాములు, నిడిగొండ సత్తయ్య, చల్ల సురేందర్ రెడ్డి, చల్ల సుధాకర్ రెడ్డి, గంగరబోయిన మహేందర్, ఎల్లయ్య , చింతల కర్ణాకర్, పర్వతం యాదగిరి, బొట్టు సుధాకర్ తదితరులు ఉన్నారు.