women harassment : రాత్రి గడిపితేనే.. ఉద్యోగం..
‘నాతో ఓ రాత్రి గడిపితేనే నీ ఉద్యోగం ఉంటుంది..’ అని ఓ మహిళా ఉద్యోగిని సంస్థ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఎజైల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఓ మహిళ ఆరేళ్లుగా పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వాహకుడైన శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో ఓ రాత్రి గడిపితేనే.. ఉద్యోగం ఉంటుందని.. లేకుంటే అంతే అంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే తన దగ్గర నుంచి శ్రీకాంత్ రూ.15 వేలు తీసుకున్నాడని, ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అతడి టార్చర్ (women harassment ) భరించలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)
ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)
ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్