బచ్చన్నపేట,మన చౌరాస్తా:యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లో కంపెనీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌ను మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన మార్క కనకయ్య మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.