youtubers in bigg boss telugu : సినిమా స్టార్లు లేని సీజన్-5.. యూట్యూబ్ స్టార్లదే హవా..
బిగ్బాస్ షో అంటేనే ప్రముఖంగా కనిపించేది సినిమాస్టార్లు అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో చూసుకుంటే గతంలో నుంచి ఎక్కువగా సినిమాల్లో చేస్తున్న వారే కంటెస్టెంట్లుగా చేస్తుండటం గమనార్హం. ఇక బిగ్ బాస్ తెలుగు షోలో ఇప్పటి వరకు 4 సీజన్లు జరగ్గా ఇందులో ఎక్కువగా మనకు సినిమా స్టార్లు కనిపించారు. కాగా 5వ సీజన్ ఆదివారం రాత్రి స్టార్ట్ అయింది. ఇందులో మొత్తం 19మంది కంటెస్టెంట్లు సందడి చేశారు. అయితే ఇందులో చాలా వరకు యూ ట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయినవాళ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. (youtubers in bigg boss telugu )
ఇక మిగిలిన వారు ఎక్కువగా బుల్లి తెరపై నటించే వారు ఉన్నారు. అయితే ఈసారి సినీ రంగం ఒక్కరికి కూడా బెర్త్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా స్టార్లెవరూ కూడా ఈ సీజన్లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇది నిజంగా షోకు పెద్ద లోటే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా స్టార్లకు ఉన్నంత క్రేజ్ మిగతా వారికి ఉండదు కదా. అప్పుడు షోను చూసే వారు చాలా తక్కువగా ఉంటారు కదా. గత నాలుగు సీజన్లోనూ శివ బాలాజీ, వరుణ్ సందేశ్, ముమైత్ ఖాన్, నవదీప్ లాంటి వాళ్లు రావడం ఎంతో క్రేజ్ తీసుకువచ్చింది. అయితే వీరి ప్రభావం పెద్దగా లేదని కొట్టిపారేయలేం. మరి 100 రోజుల పాటు సాగే ఈ షోలో వైల్డ్ కార్డ్ ల ద్వారా ఎవరైనా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
గర్భవతిని వదిలేసి వచ్చిన నటరాజ్
అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..