హైదరాబాద్, చౌరాస్తా :- ఇక 2023 సంవత్సరం ముగియనుంది. మరో ఐదు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. చాలా మంది ఇప్పటి నుంచి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతుండగా,హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు.
పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు…
- న్యూఇయర్ వేడుకలకు రాత్రి 1 గంట వరకు ముగించాలి
- ఈవెంట్ నిర్వహకులు 10 రోజుల ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి
- ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
- ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరి
- అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు
- 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు
- కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దు
- పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
- సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు
- లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు
- న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు
- సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు
- తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు పడితే రూ.10 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్.