
జనగామ, మన చౌరాస్తా : జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి (తెలుగు& ఇంగ్లీష్) గాయకులు, రచయిత అంతర్జాతీయ ఇంగ్లీష్ పోయెట్,సనత్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్,సామాజిక వేత్త, బహుముఖ ప్రజ్ఞ శాలి, తెలుగు కవి (వచన కవిత్వం ), సైకాలజిస్ట్, స్కిల్ డెవలప్మెంట్ ట్రేనర్ రేణుకుంట్ల మురళి బైండ్ల కు ప్రతిష్టాత్మకంగా “మహాత్మా గాంధీ నాయకత్వం అవార్డు 2026,”ను ఎన్ ఆర్ ఐ వెల్ఫేర్ సొసైటీ, యు కె చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ సునిల్ ఖంటి రాయ్, డాక్టర్ దీపక్ సింగ్ కన్వీనర్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా లార్డ్ మేయర్ ఆక్స్ఫర్డ్, లండన్ లోలార్డ్ మేయర్ ఆఫ్ ఆక్స్ఫార్డ్ కౌన్సిల్ ఛాంబర్,సెయింట్ ఆల్ డేట్స్ ఆక్స్ఫర్డ్ OX1,1BX, UK
ఫర్ ఇండో బ్రిటిష్ టెక్నాలజీ కోఆపరేషన్
ఆక్స్ఫార్డ్ కౌన్సిల్ ఛాంబర్,యునైటెడ్ కింగ్డమ్ లో ఆగష్టు 12 తేదిన 2026 లో అందుకోబోతున్నారని డాక్టర్ సునిల్ కంటి రాయ్, డాక్టర్ దీపక్ సింగ్ ప్రకటించారు.మురళి రాసిన ప్రముఖ కవితలు, పాటలు,రచనలు మరియు విద్యా, సామాజిక, సాంస్కృతిక, అనేక సేవా రంగాల్లో సానుకూల ప్రభావాన్ని గుర్తించారు.మురళీ యొక్క అంకితభావం, నాయకత్వం లక్షణాలను మరియు సాంఘిక సంక్షేమం కు నిబద్ధత ఈ అంతర్జాతీయ గౌరవానికి అత్యుత్తమ అభ్యర్థిగా పేర్కొన్నారు. గతంలో మురళి అనేక ప్రశంస పత్రాలు, విజయాలు సాదించారు. అవే ఈ గుర్తింపునకు దోహద పడ్డాయని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ నాయకత్వ పురస్కారం, అటువంటి సమగ్రత, సేవ మరియు మానవతా నాయకత్వం వంటి గాంధీ విలువలను రూపొందిస్తున్న వ్యక్తులకు ప్రతి సంవత్సరం అందించబడుతుంది. ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన రచనలు చేస్తానని నేను పుట్టిన గడ్డకు,తెలంగాణా రాష్ట్రానికి మన భారత దేశానికి మంచి పేరు ప్రతిష్ట లు తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలిపారు . ఈ అవార్డు కు ప్రోత్సహించిన డాక్టర్ శెశిని ముడ్లియర్ రెన్స్ బర్గ్ మేడం లండన్ ప్రముఖ డాక్టర్ సైకియట్రిస్ట్ , కవయిత్రి,సాంస్కృతిక వ్యాఖ్యాత కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని మరియు ఈ అంతర్జాతీయ అవార్డును జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు బైండ్ల సారయ్య, మల్లికాంభ లకు, విద్యా బుద్దులు నేర్పిన గురువు లకు అంకితం చేస్తున్నానని మురళి తెలిపారు.




