
అధ్యక్షుడిగా నల్ల రమేష్ ఏకగ్రీవం
జనగామ, మన చౌరాస్తా : రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల యూనియన్ జనగామ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నల్ల రమేష్ ఎన్నికవ్వగా, ఉపాధ్యక్షులుగా మేకల నాగరాజు, తాళ్ళపల్లి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా తాటి మహేశ్వరి, సహాయ కార్యదర్శిగా నస్కూరి శ్రీను, కోశాధికారిగా చింతకింది రాంప్రసాద్లను ఎన్నుకున్నారు. అలాగే గౌరవ సలహాదారులుగా పాతూరి లక్ష్మారెడ్డి, కుసుమ కిరణ్ కుమార్, గుగులోతు రవీందర్, ఉప్పుల పరుశురాములు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నల్ల రమేష్ మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. పథకం అమలులో ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని, వారి సేవలను గుర్తించి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సిబ్బందిని ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.




