
బచ్చనపేట, మన చౌరాస్తా : బచ్చన్నపేట మండలం కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండ కింది హరిబాబు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి, ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పరుస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో విధాలుగా సొంత అన్నలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండ దండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్రాజ్ భాగ్యలక్ష్మి, నాయకులు పిన్నింటి నారాయణరెడ్డి, జిల్లా సందీప్, గిద్దల రమేష్, రామీని మదన్మోహన్, చెరుకూరి శ్రీనివాస్, మల్లారెడ్డి, గుర్రపు బాలరాజు, అంబాలా ఆగయ్య గౌడ్, వేముల బాలరాజు, గుట్ట డైరెక్టర్ నిమ్మ కరుణాకర్ రెడ్డి, అక్కిరెడ్డి శ్రీధర్, సిద్ధిరాములు, సిరిపాటి రామదాసు, ఇరుగు ప్రకాష్, భాస్కర్ రెడ్డి, దిడిగా రమేష్, మల్లేష్,దాసరం శ్రీనివాసరెడ్డి,నడిగొట్టు శ్రీకాంత్,నడిగొట్టు బిక్షపతి,మల్లేశం, నీల రమేష్, కొండ హరికృష్ణ ,కోక్కలకొండ బాబు, ఎద్దు నాగయ్య ,మల్గం శీను, తదితరులు పాల్గొన్నారు.





