
- మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
భీమదేవరపల్లి, మన చౌస్తా: శ్రీలంకలో ఈనెల 17, 18వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మాడుగుల ప్రవీణ్ జట్టు శిక్షకుడిగా ఎంపికయ్యారు. శ్రీలంకలోని వెన్నపూవ్వ నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ కరాటే పోటీల్లో ఆయన శిక్షకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా మాడుగుల ప్రవీణ్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు గ్రామ, మండల నాయకులు అభినందించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు జట్టు శిక్షకుడిగా ఎంపిక కావడం ముస్తఫాపూర్ గ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




