మన చౌరాస్తా,యాదాద్రి భువనగిరి :
యాదాద్రి క్రియేషన్స్ లో లగ్గం ఫుల్ సాంగ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి & బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ & ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలన్న గార్లతో ఫుల్ సాంగ్ సీడి ఆవిష్కరణ చేయడం జరిగింది.
తెలంగాణ జానపదం సినిమాల్లో రావడం సంతోషంగా ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యాదాద్రి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఓ ప్రైవేట్ పాటను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫోక్ సాంగ్ తెలంగాణ భాష,యాస సంస్కృతి గురించి పాటలు నిర్మించడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన పాటలు, సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.